V6 News

Vijay Deverakonda: కుక్కల గుంపు.. చేతిలో కత్తులు.. విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీ పోస్టర్ చూస్తే పూనకాలే!

Vijay Deverakonda: కుక్కల గుంపు.. చేతిలో కత్తులు.. విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీ పోస్టర్ చూస్తే పూనకాలే!

టాలీవుడ్ రౌడ్ స్టార్ విజయ్ దేవరకొండ మరింత జోరు పెంచారు. సక్సెస్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే క్రేజీ ప్రాజెక్టులైన 'రౌడీ జనార్థన', 'రణబాలి ' మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు ఒకే చెప్పారు. లేటెస్ట్ గా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది.

నా శక్తినంతా ధారపోస్తా..!

సున్నితమైన క్లాసిక్ చిత్రం 'హాయ్ నాన్న'తో టాలీవుడ్ ను పలకరించిన యంగ్ డైరెక్టర్ శౌర్యన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాలో విజయ్ చాలా విభిన్నంగా ఉండబోతున్నారని లేటెస్ట్ గా అనౌన్స్ మెంట్ పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు #VDxShouryuv అనే వర్కింగ్ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. శౌర్యువ్ వైల్డ్ ఇమాజినేషన్, ఇంటెన్స్ హార్ట్ తో ఈ భయంకరమైన చిత్రాన్ని రూపొందించే బాధ్యతను ఒక అద్భుతవమైన గ్లోబల్ టీమ్ తీసుకుంటోంది. దీని కోసం 'నా శక్తినంతా ధారపోస్తా'ను అంటూ తన ఉత్సాహాన్ని పంచుకున్నారు రౌడీస్టార్.

భారీ వార్ సినిమానా?

ప్రస్తుతం ఈ సినిమా  అనౌన్స్ మెంట్ పోస్టర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీనిలో విజయ్ దేవరకొండ, చిత్ర బృందం చాలా పవర్ ఫుల్ అవతారాల్లో కనిపిస్తున్నారు. వేటకుక్కల గుంపు వెనక నడుస్తూ చాలా సీరియస్  లుక్ లో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు. దర్శకుడు శౌర్యువ్ భుజంపై కత్తిని ధరించి , ఒక గుర్రం పక్కన నడుస్తూ యుద్ధవీరుడిలా కనిపిస్తుండగా.. ఇతర సాంకేతిక సిబ్బంది కూడా పురాతన యుద్ధ ఆయుధాలను పట్టుకుని కనిపిస్తూ ఈ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు. ఇది పీరియడ్ యాక్షన్ డ్రామా లేదా ఒక భారీ వార్ ఫిల్మ్ అయి ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే 'హాయ్ నాన్న'తో అభిరుచి గల నిర్మాతలుగా పేరు తెచ్చుకున్న వీరు, ఈ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేయబోతున్నారని విజయ్ హింట్ ఇవ్వడంతో, టెక్నికల్ పరంగా ఈ సినిమా సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.  'లైగర్', 'ఫ్యామిలీ స్టార్' వంటి సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ ఒక విభిన్నమైన కథతో, మునుపెన్నడూ చూడని లుక్‌లో సిద్ధమవుతున్నారు .  త్వరలోనే ఈ సినిమా షూటింగ్ , ఇతర నటీనటుల వివరాలు వెల్లడికానున్నాయి.