V6 News

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు... నటుడు ప్రకాష్ రాజ్ పై పరువునష్టం దావా..!

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు... నటుడు ప్రకాష్ రాజ్ పై పరువునష్టం దావా..!

నటుడు ప్రకాష్ రాజ్... సినిమాల్లో మంచి నటనతోనే కాకుండా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు. రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్ళీ వివాదానికి తెర లేపాడు ప్రకాష్ రాజ్. రాముడు నార్త్ ఇండియన్ అని.. రావణుడు సౌత్ ఇండియన్ ట్రైబల్ అని.. రావణుడి దగ్గర రాముడు పండ్లు దొంగిలించాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ప్రకాష్ రాజ్. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రకాష్ రాజ్ పై కేసులు నమోదయ్యాయి.

టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ప్రకాష్ రాజ్ పై పరువు నష్టం దావా వేశారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని అన్నారు భానుప్రకాష్ రెడ్డి. హిందువులకు ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు భానుప్రకాష్ రెడ్డి.

త్వరలోనే నరమేధం అంటూ సంచలన వ్యాఖ్యలు:

రాముడి గురించే కాకుండా మత సమరస్యంపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నరమేధానికి సంకేతంగా కనిపిస్తున్నాయని అన్నారు ప్రకాష్ రాజ్. గిరిజనులు, మైనార్టీలను తుడిచిపెట్టాలని చూస్తున్నారని అనాన్రు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై హిందువులు, నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

ప్రకాష్ రాజ్ పై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. మతపరమైన మనోభావాలు దెబ్బతీసిన క్రమంలో 295A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. వర్గాల మధ్య వైషమ్యాలను ప్రేరేపించడం, మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం వంటి అభియోగాల కింద ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.