టీసీఎస్ నాసిక్ బీపీఓ యూనిట్‌లో చెలరేగిన లైంగిక వేధింపులు, మత మార్పిడిల వివాదం ఇప్పుడు ఒక సినిమాటిక్ మలుపు తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు మాస్టర్ మైండ్ నిదా ఖాన్.. ప్రస్తుతం ముంబైలోని తన ఇంట్లో ఉంటూనే న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. అయితే ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. తాను పరారీలో లేనని, పైగా తాను గర్భవతినని పేర్కొంటూ ముందస్తు బెయిల్ కోసం ఆమె పావులు కదపటమే.
హెచ్ఆర్ హెడ్ కాదు.. కేవలం టెలికాలర్?
ఆమె కుటుంబం చెబుతున్న వెర్షన్ ఏంటంటే తమ కుమార్తె అసలు హెచ్ఆర్ టీమ్‌లోనే లేదని అంటున్నారు. 2021లో కేవలం సేల్స్ టీమ్‌లో టెలికాలర్‌గా చేరింది. టీవీల్లో వస్తున్నవన్నీ అబద్ధాలు అంటూ ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూతురు మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తోందని మురిసిపోయిన ఆ తండ్రి ఇప్పుడు ఆమెను అసలు ఉద్యోగానికే పంపకుండా ఉండాల్సిదమటబ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ప్రెగ్నెన్సీ అస్త్రంతో బెయిల్ వేట..
నిదా ఖాన్ తరపు న్యాయవాది బాబా సయ్యద్ ఇప్పటికే నాసిక్ సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే పనిలో ఉన్నారు. ఈ పిటిషన్‌లో ప్రధానంగా ఆమె గర్భవతి అన్న అంశాన్ని హైలైట్ చేయబోతున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా, మానవతా దృక్పథంతో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరనున్నారు.
►ALSO READ | AI భవిష్యత్ చెప్పేసిన ఎలాన్ మస్క్ : జనానికి పని ఉండదు.. ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టాలి..!
ఒక 23 ఏళ్ల ఉద్యోగిని తన సీనియర్ డానిష్ షేక్ పై చేసిన ఫిర్యాదుతో ఈ బాగోతం బయటపడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడం, హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇస్లాంను ప్రచారం చేయడం వంటి సంచలన ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు 78 అనుమానాస్పద కాల్స్, ఈమెయిల్స్, చాట్‌లను పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిదా ఖాన్‌ను ఇప్పటికే టీసీఎస్ సస్పెండ్ చేసింది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ స్వయంగా అంతర్గత విచారణకు ఆదేశించారు.
నిజంగా నిదా ఖాన్ ఈ కుట్రలో భాగస్వామినా? లేక ఆమె కుటుంబం చెబుతున్నట్టు కేవలం హాయ్, బై.. చెప్పే అమాయక ఉద్యోగిని మాత్రమేనా? చట్టం ముందు ఆమె గర్భవతి అన్న వాదన నిలుస్తుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

