ప్రభాస్ 1000 రేట్లు గొప్పోడు.. ఆయనలా నువ్వు కూడా..!

ప్రభాస్ 1000 రేట్లు గొప్పోడు.. ఆయనలా నువ్వు కూడా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ రూటే సపరేట్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం ఆయనకు నచ్చదు. హిట్టో.. ఫ్లాపో.. ఆయన పంథాలోనే సినిమాలు చేస్తూ ఉంటాడు. మొదటి సినిమా చిత్రం ఉంది ఇప్పుడు రానున్న అహింస వరకు అదే ఫాలో అయ్యారు తేజ. ఇక తాజాగా ఆయన మ్యాచో స్టార్ గోపీచంద్ ని ఇంటర్వ్యూ చేసాడు. గోపీచంద్ హీరోగా వస్తున్న తాజా చిత్ర రామబాణం. ఈ మూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ తేజ, గోపీచంద్ చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో భాగంగా తేజ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. నన్ను జయం మూవీలో తీసుకోవడానికి కారణం ఎవరు? అని తేజని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా.. నేను మీ నాన్న టి. కృష్ణ గారి దగ్గర నేను పనిచేశాను. ఆయన అంటే అందరికి ఇష్టమే. అందరు చెప్తుంటారు. తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకు వస్తుందని. ఆయన చేసిన మంచే నీకు జయం ఛాన్స్ వచ్చేలా చేసింది.

అయితే నేను కేవలం రోడ్డును.. ఆ గోల్ వరకు తీసుకెళ్లడానికి మీ నాన్నే కారణం. అలా రేపు నీ పిల్లలకు చెప్పుకోవడానికి నీ దగ్గర ఏముంది. నేను కృష్ణంరాజు గారి దగ్గర కూడా పనిచేశాను. ఆయన కొడుకు ప్రభాస్.. 1000 రేట్లు మంచివాడు. అతనికి విబేధాలు ఉండవు. ఇండస్ట్రీలో కానీ, బయట కానీ అతనిని అందరు ఇష్టపడతారు. అలానే మీ నాన్నగారిని కూడా అందరు ఇష్టపడతారు. ఆయనను ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోరు. ఆయన గుడ్ విల్ నీకు పనిచేసింది. ఆయనలానే నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తేజ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.