
హైదరాబాద్, వెలుగు: సిటిజన్లకు వెదర్ అలర్ట్ అందించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్) నయా టెక్నాలజీని వాడుతోంది. కామన్ అలర్టింగ్ ప్రొటోకాల్ పేరుతో ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ నెట్వర్క్ పరిధిలో ఉన్న వారికి రెయిన్ అలర్ట్ మెసేజ్లు వెళ్లేలా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి 2 నెలలుగా టెలికాం సంస్థలు చర్యలు జరిపి వారం రోజులుగా ఈ టెక్నాలజీని వాడుతున్నాయి.
ALSO READ:కేసీఆర్ పండరీపూర్ టూర్లో మటన్కర్రీ పంచాదీ
టెలికాం సంస్థల సహకారంతో ఐఎండీ ఇచ్చిన వాతావరణ సమాచారాన్ని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని జనాలకు మెసేజ్ల రూపంలో పంపుతున్నట్లు డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. వానలు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని జనాలకు ముందుగానే అలర్ట్ వెళ్తుందన్నారు. తద్వారా స్థానిక జనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చన్నారు. కాగా, సిటీలో మరో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడుతుందన్నారు. మంగళవారం పటాన్ చెరు, చార్మినార్, సరూర్నగర్, బహదూర్పురా తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.