మెదక్ (చేగుంట)/రామాయంపేట, వెలుగు: విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణను అలవాటు చేసుకుంటేనే మంచి భవిష్యత్కు మార్గం ఏర్పడుతుందని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం చేగుంట మండలంలోని రెడ్డిపల్లి కేజీబీవీని సందర్శించిన ఆమె, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించడంతో పాటు వంటగదిని, భోజన నాణ్యతను తనిఖీ చేశారు.
అనంతరం రామాయంపేట పట్టణంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, అదనపు కూలీలను ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
