పాలక పక్షానికి ఒకరకంగా.. విపక్షాలకు మరో రకంగా..

పాలక పక్షానికి ఒకరకంగా.. విపక్షాలకు మరో రకంగా..
  • నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారు
  • అందరికీ సమానంగా నిధులు కేటాయించాలి
  • బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

సిద్దిపేట: తనకున్న అంచనా ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. అందుకే త్వరలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్ లో అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం నిధులైనా.. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నిధులైనా.. పాలకవర్గానికి.. ప్రతిపక్షాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపొద్దన్నారు. 
గత బడ్జెట్ హామీలేవీ ఆచరణలోకి రాలేదు
గత బడ్జెట్ లో ఇచ్చిన హామీలు చాలా వరకు ఇప్పటివరకు ఆచరణలో పెట్టలేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్లో  నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవాళ్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా 7లక్షల 59వేలు ఇవ్వాలన్నారు. వృద్ధాప్య పెన్షన్ అర్హత తగ్గిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని, అలాగే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడంలో ఆలస్యమైతే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ అమలులో భాగంగా నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్ కేటాయించి హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 

 

ఇవి కూడా చదవండి

సినిమా బాగుంటే చూస్తారు..లేకపోతే మరో అజ్ఞాతవాసి

కాంగ్రెస్‌కు రాజీనామా చేయ‌ను