దిశ శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించిన ఫోరెన్సిక్ నిపుణులు

దిశ శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించిన ఫోరెన్సిక్ నిపుణులు

దిశ కేసులో మరో  కీలక  ఆధారం బయటపడింది. దిశ శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. దిశ లివర్ లో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. హత్యచారం చేసేటపుడు నిందితులు దిశకు బలవంతంగా మద్యం పోసినట్లు నిర్దారించారు. హైవేపై నిందితులు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు సేకరించారు.

మరో వైపు నిందితుల డీఎన్ఏ రిపోర్టులో సైతం కీలక అంశాలు ఉన్నాయి. గతంలో జరిగిన నేరాలకు దిశ నిందితులకు డీఎన్ఏ మ్యాచ్ అవుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. నిందితులకు నేర ట్రాక్ రికార్డ్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.