సీఎం ప్రజావాణి దేశానికే ఆదర్శం..అభినందించిన మధ్య ప్రదేశ్ తహసీల్దార్లు

సీఎం ప్రజావాణి  దేశానికే ఆదర్శం..అభినందించిన మధ్య ప్రదేశ్ తహసీల్దార్లు

హైదరాబాద్, వెలుగు: సీఎం ప్రజావాణి యావత్ దేశానికే ఆదర్శమని మధ్యప్రదేశ్ తహసీల్దార్లు కొనియాడారు. శుక్రవారం ప్రజాభవన్​లో జరిగిన సీఎం ప్రజావాణి అమలు తీరును పరిశీలించారు. వివిధ డెస్క్ అధికారులను పలు అంశాలు అడిగి తెలుసుకు న్నారు. సీఎం ప్రజావాణి కార్యక్రమం తమలో స్ఫూర్తిని నింపిందని, తమ రాష్ట్రంలో ఇదే ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వ, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 

సీఎం ప్రజావాణి తీరుతెన్నులను ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్​చార్జి డాక్టర్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వారికి వివరించారు. శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 380 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.