మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్..

మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్..

 తెలంగాణ ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ ఇయర్ లో 66.94 శాతం ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్ లో  75.61 శాతం పాసయ్యారు.  ఇంటర్ పరీక్షల రీ కౌంటింగ్ , రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 13 నుంచి 20 వరకు  అప్లయ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. 

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుండి ప్రారంభం కానున్నాయి. సప్లిమెంటరీ పరీక్ష  ఫీజు   ఏప్రిల్ 13 నుంచి  ఏప్రిల్ 20  వరకు చెల్లించవచ్చు.  రెండు సెషన్స్ లో పరీక్షలు జరగనున్నాయి.  ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 22 న ప్రారంభం కానుండగా రెండు సెషన్స్ లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. 

 ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల  సందర్భంగా ప్రభుత్వ సలహాదారు కే .కేశవరావు మాట్లాడుతూ..ఇంటర్ పరీక్షల్లో పాసయిన వారికి కంగ్రాట్స్  చెప్పారు.  ఫెయిల్ అయిన వారు చింతించ వద్దని సూచించారు.  70.58 పర్సెంట్ పాస్ అవ్వడం మంచి విషయమని అన్నారు .  పుస్తకంలో ఉన్న దాన్ని అర్ధం చేసుకోవడమే కాదు బయట ప్రపంచాన్ని సైతం అర్ధం చేసుకోవడం పూర్తి నాలెడ్జ్ అని చెప్పారు.  ఇంటర్ అనేది భవిష్యత్ ప్రణాళికలకు పునాది అని అన్నారు.  ఇంటర్ బోర్డు సెక్రటరీ, కంట్రోలర్స్ అందరి కృషి కారణంగా ఫలితాలు అద్భుతంగా వచ్చాయన్నారు.  ఫెయిల్ అయిన వాళ్లు బాధపడకుండా తదుపరి సప్లై పరీక్షలపై ద్రుష్టి సారించాలని కోరారు.