- ఢిల్లీలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య మకాం
న్యూఢిల్లీ: కర్నాటకలో మంత్రివర్గ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు సీఎల్పీ నేత డీకే శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. జూన్ 3న సాయంత్రం 4:05 గంటలకు శివకుమార్‌తోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్ణాటక కేబినెట్‌లో సీఎంతో కలిపి గరిష్టంగా 34 మందికి మాత్రమే అవకాశం ఉండగా.. ఆశావహుల సంఖ్య మాత్రం భారీగా ఉంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తమకు అవకాశం కల్పించాలని ఇరు నేతలను కోరుతున్నారు. కుల సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతతోపాటు సిద్ధరామయ్య వర్గంతో కూడిన విధేయతకు పెద్దపీట వేస్తూ కొత్త, పాత కలయికగా ఈ మంత్రివర్గం ఉండనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వంలో పలువురు ఉపముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
