డీఎంఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అప్లికెంట్స్ లిస్ట్ రిలీజ్

డీఎంఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అప్లికెంట్స్ లిస్ట్ రిలీజ్
  •     నేటి నుంచి 28 సాయంత్రం వరకు అభ్యంతరాలకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో 609 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకున్న అభ్యర్థుల వివరాల లిస్టును తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) బుధవారం రిలీజ్ చేసింది. 

ఈ పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ లిస్టును బోర్డు వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం రిలీజ్ చేసిన లిస్టులో ఉన్న వివరాలన్ని అభ్యర్థులు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌లో స్వయంగా ఎంటర్ చేసినవేనని బోర్డు స్పష్టం చేసింది. అప్లికెంట్స్ లిస్టులో ఏవైనా తప్పులున్నా, అభ్యంతరాలుంటే.. గురువారం నుంచి ఫిబ్రవరి 28 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలపచ్చని వెల్లడించింది.