రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాఫ్ట్‌వేర్‌లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని సూచించింది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ ప్రకియలో ఇతర గుర్తింపు సర్టిఫికెట్లు అడగొచ్చని.. ఆధార్ వివరాలు మాత్రం సేకరించవద్దని స్పష్టం చేసింది. కోర్టుకు ఇచ్చిన హామీని ప్రభుత్వం ఉల్లంఘించిందని.. తెలివిగా ప్రజల సున్నితమైన సమాచారం సేకరిస్తే అంగీకరించబోమని స్పష్టం చేసింది. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపైనే తమ ఆందోళనని.. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆధార్ కార్డు వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అడగవద్దంటూ ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేసిన హైకోర్టు… తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.
