‘న్యూఇయర్ గిఫ్ట్’  పుకార్లను నమ్మొద్దు

‘న్యూఇయర్ గిఫ్ట్’  పుకార్లను నమ్మొద్దు

న్యూఢిల్లీ: న్యూఇయర్​ సందర్భంగా రూ.20 వేల విలువైన గిఫ్టు ఇస్తున్నామంటూ ఆన్​లైన్​లో వస్తున్న పోస్టులను నమ్మొద్దని రామ్​రాజ్​ కాటన్​కస్టమర్లకు సూచించింది. కొందరు ఆకతాయిలు వాట్సప్​ వంటి ఆన్​లైన్​లో ఫేక్​ లింకులను పంపిస్తున్నారని తెలిపింది. తమ పేరును దెబ్బతీయడానికే ఇలాంటి పనులు చేస్తున్నారని, వాళ్లు పంపే లింకులను ఓపెన్​ చేస్తే పర్సనల్ ఇన్ఫర్మేషన్​ చోరీ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలాంటి సమస్యలకు తాము బాధ్యత వహించబోమని స్పష్టం చేసింది. పుకార్లు రేపిన వారిపై చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు కంప్లయింట్​ చేశామని రామ్​రాజ్​ ప్రకటించింది. క్రిస్మస్​ పండుగ పేరుతోనూ ఇటీవల  ఫేక్ లింకులను పంపిచారని తెలిపింది.