హైదరాబాద్, వెలుగు: ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాలు అందేలా చూడటం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.
మంగళవారం హైదరాబాద్ బొగ్గులకుంటలోని రాష్ట్ర దేవాదాయశాఖ కార్యాలయంలో ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ దేవాదాయశాఖలో ఎస్టీలకు కేటాయించిన రోస్టర్ పాయింట్లను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
