రొనాల్డో రికార్డు గోల్స్‌.. ఆరు వేర్వేరు వరల్డ్‌ కప్‌ ఎడిషన్లలో గోల్స్‌ చేసిన తొలి ప్లేయర్

రొనాల్డో రికార్డు గోల్స్‌.. ఆరు వేర్వేరు వరల్డ్‌ కప్‌ ఎడిషన్లలో గోల్స్‌ చేసిన తొలి ప్లేయర్

హుస్టన్‌: పోర్చుగల్‌ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో.. ఫిఫా వరల్డ్‌ కప్‌లో అరుదైన ఘనత సాధించాడు. మంగళవారం ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో రెండు గోల్స్‌ (6, 39వ ని) చేశాడు. దాంతో ఆరు వేర్వేరు వరల్డ్‌ కప్‌ ఎడిషన్లలో గోల్స్‌ చేసిన తొలి ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

2006 అరంగేట్రం నుంచి 2026 వరకు జరిగిన ప్రతి టోర్నీలోనూ గోల్‌ చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. అర్జెంటీనా స్టార్‌ మెస్సీ కూడా ఆరు వరల్డ్‌ కప్స్‌ ఆడినా.. 2010 టోర్నీలో గోల్‌ చేయలేకపోయాడు. నునో మెండెస్‌ (17వ ని), అబ్దుకొడెర్‌ కుషనోవ్‌ (60వ ని), రాఫెల్‌ లియో (87వ ని) గోల్స్‌ కొట్టడంతో.. గ్రూప్‌–కేలో పోర్చుగల్‌ 5–0తో ఉజ్బెకిస్తాన్‌పై గెలిచి నాకౌట్‌ దశగా మరో అడుగు ముందుకేసింది.