న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ట్రేడింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఫ్రాంచైజీని వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పాండ్యాను తీసుకునేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ముంబై ఇండియన్స్‌తో ప్రాథమిక చర్చలు జరిపినట్లు లీగ్ వర్గాలు పేర్కొన్నాయి.
పాండ్యాను దక్కించుకునే విషయంలో కేకేఆర్ ఓ అడుగు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేను ఈ సీజన్ తర్వాత విడిచి పెట్టి అతని ప్లేస్‌లో పాండ్యాను తీసుకురావాలని భావిస్తున్నారు. రాజస్తాన్ రాయల్స్ కూడా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ముంబైకి ఇచ్చి బదులుగా పాండ్యాను తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది.
అయితే రియాన్ పరాగ్‌ను దీర్ఘకాలిక కెప్టెన్‌గా చూస్తున్నందున పాండ్యాకు కెప్టెన్సీ దక్కడం కష్టమే. మరోవైపు లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్.. తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి వచ్చాడు. ఈ మేరకు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ట్రేడ్ చేసి పంత్‌ను తీసుకుంది.
అయితే ఈ ట్రేడింగ్‌లో పంత్ రూ. 15 కోట్లకే డీసీకి వెళ్లాడు. 2025 మెగా వేలంలో పంత్‌ను లక్నో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. కుల్దీప్ రూ. 13.50 కోట్లకే లక్నోకు వెళ్లిపోయాడు.
