వాషింగ్టన్: స్విట్జర్లాండ్‌లో సోమవారం చర్చల సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కెమెరా ముందే తనను పట్టించుకోకుండా వెళ్ళిపోయారంటూ వస్తున్న కథనాలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఇరాన్ చర్చల ప్రతినిధులను ‘తీవ్ర అయోమయానికి గురిచేసేవారు’ అని ఆయన అభివర్ణించారు.
అయితే, అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు 9 గంటల పాటు చర్చలు జరిగాయని, విజయవంతమైన తుది ఒప్పందానికి ఈ చర్చలు మంచి పునాదిని వేశాయన్నారు. కాగా, సోమవారం నాటి సమావేశంలో చర్చల గదిలో జేడీ వాన్స్ ఉన్నప్పటికీ, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఆయనను పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
అరాఘ్చీ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌ను పలకరిస్తూ, ఆలింగనం చేసుకోవడం కనిపించింది. ఆ సమయంలో వాన్స్ చర్చల టేబుల్ వెనుక నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు.
