లండన్: ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ హాకీ మ్యాచ్‌లో ఇండియా.. పాకిస్తాన్‌కు చెక్ పెట్టింది. మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో ఇండియా 4–3తో పాకిస్తాన్‌పై గెలిచింది. అభిషేక్ (22వ ని), నీలకంఠ శర్మ (24వ ని), సుఖ్‌జీత్ సింగ్ (40వ ని), రాజిందర్ సింగ్ (52వ ని) ఇండియాకు గోల్స్ అందించారు.
పాక్ తరఫున అహ్మద్ నదీమ్ (8వ ని), అబు మహ్మద్ (53వ ని), షకీల్ మోయిన్ (60వ ని) గోల్స్ చేశారు. తొలి క్వార్టర్‌లో ఆధిక్యం చూపెట్టిన పాక్‌ను ఆ తర్వాత ఇండియా ఫార్వర్డ్స్ ముప్పుతిప్పలు పెట్టారు. డిఫెన్స్‌ను ఛేదిస్తూ గోల్స్ చేసే అవకాశాలను సృష్టించుకున్నారు. వచ్చిన పెనాల్టీ కార్నర్లను కూడా ఇండియా సమర్థంగా ఉపయోగించుకుంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఇండియా.. ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
