
మాదాపూర్, వెలుగు: వరుస ప్రమాదాల నేపథ్యంలో మాదాపూర్దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సోమవారం స్థానిక పోలీసులు అవగాహన కల్పించారు. బ్రిడ్జిపై ఎవరూ వాహనాలు నిలపవద్దని, ఫొటోలు దిగవద్దని, ఇన్స్టా రీల్స్ చేయొద్దని సూచించారు. ట్రాఫిక్ రూల్స్బ్రేక్చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.