హైదరాబాద్, వెలుగు: సినిమాల్లో దళిత హీరోయిజంపై రీసెర్చ్ చేసిన జర్నలిస్ట్ మహేశ్కొంగరకు డాక్టరేట్ దక్కింది. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం, మాస్కమ్యూనికేషన్డిపార్ట్మెంట్ నుంచి ఆయన గురువారం పట్టా అందుకున్నారు. ప్రొఫెసర్ డాక్టర్ టి.సతీశ్ కుమార్పర్యవేక్షణలో ‘దళిత్అసర్షన్ అండ్ మీడియా: ఏ స్టడీ ఆఫ్ సెలక్ట్ తెలుగు ఫిల్మ్స్’ అనే అంశంపై మహేశ్ థీసిస్ సమర్పించారు. బలిపీఠం, స్వయం కృషి, ఒసేయ్ రాములమ్మ, పలాస 1978, లవ్‌స్టోరీ సినిమాల్లోని ప్రధాన పాత్రలను రీసెర్చ్‌కు ఎంచుకున్నట్టు మహేశ్ తెలిపారు.
దళితులు కోరుకుంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆత్మగౌరవం వంటివి ఈ సినిమాల్లో కనిపిస్తాయన్నారు. అయితే, కథా రచయితలు, డైరెక్టర్లు, నిర్మాతలు, నటీనటులు దళితేతరులు కావడం వల్ల దళితుల వాస్తవ జీవితాలకు దూరంగానే హీరోల పాత్రలు కనిపిస్తాయని, దళితుల జీవితాలను నిండుగా స్పృశించలేదని చెప్పారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో దళితుల ప్రాతినిధ్యం ఇంకా మొదలు కాలేదని చెప్పారు.
