
- 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్
- శాలరీ.. అవర్ రైట్.. నో పే.. నో వర్క్ అంటూ నినాదాలు
- పెండింగ్ స్టైఫండ్ తోపాటు.. మార్చి నుంచి జీతాలు ఇవ్వాలని డిమాండ్
- కోవిడ్ సమయంలో 3 నెలలు చేసిన డ్యూటీని.. ఇంటర్న్ షిప్ గా పరిగణించాలి: పీజీల డిమాండ్
సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో సీనియర్ రెసిడెంట్ వైద్యుల ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో నిరసన చేపట్టారు డాక్టర్లు. ‘జీవితం సాగాలంటే.. జీతం కావాలి, శాలరీ.. అవర్ రైట్.. నో పే.. నో వర్క్’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన నినాదాలు చేశారు. కోవిడ్ తొలిసారి ప్రబలిన సమయంలో అందరూ భయాందోళనకు గురవుతున్న కీలక సమయంలో డ్యూటీ చేస్తే.. 3 నెలల స్టైఫండ్ ఇంత వరకు ఇవ్వలేదని... అలాగే ఈ డ్యూటీని ఇంటర్న్ షిప్ గా పరిగణించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే గత మార్చి నెల నుండి తమకు జీతాలు ఇవ్వడం లేదని.. బకాయి పడ్డ మూడు నెలల స్టైఫండ్ తోపాటు.. తాజాగా బకాయిపడిన 3 నెలల జీతాలు వెంటనే చెల్లించే వరకు ఆందోళన విరమించబోమని రెసిడెంట్ డాక్టర్లు ప్రకటించారు. స్పందించకపోతే అత్యవసర విధులను కూడా బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు.