- టాయిలెట్‌కు వెళ్లిన కుక్క
- ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్అధికారుల మధ్య ఘర్షణ
- పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన వ్యవహారం
- కేసు నమోదు చేసిన పోలీసులు
జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్‌లోని ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్‌లో పెంపుడు కుక్క కారణంగా ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇది కేసు నమోదు చేసేవరకు వెళ్లింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉంటున్న ఐఆర్ఎస్ ఆఫీసర్నితికా సింగ్ పెంపుడు కుక్క ఈ నెల 13న సమీపంలోని ఐఎఫ్ఎస్ అధికారి సుతన్ ఇంటి వద్ద మల విసర్జన చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుతన్.. నితికా సింగ్ ఇంటికి వెళ్లి అక్కడి సిబ్బందిని నిలదీశారు. ఈ సందర్భంగా ఇద్దరు అధికారుల మధ్య మాటల యుద్ధం నడిచింది.
సుతన్ తన ఇంటికి వచ్చి సిబ్బందిపై కేకలు వేయడంతో పాటు, ఇంటి తలుపులను బలంగా కొట్టారని నితికా సింగ్ బంజారాహిల్స్పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఇంటి బయట ఉన్న పూల కుండీని విసిరి కొట్టారని, తనతో అసభ్యంగా మాట్లాడారని, అశ్లీల సైగలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు అతడి నుండి ప్రాణహాని ఉందని, తనకు భద్రత కల్పించాలని ఐఆర్ఎస్ అధికారి నితికా సింగ్ కంప్లయింట్లో కోరారు. బంజారాహిల్స్ పోలీసులు ఐఎఫ్ఎస్ అధికారి సుతన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

