బైక్​తో స్టంట్స్ చేయడం.. నా తప్పే

బైక్​తో స్టంట్స్ చేయడం..   నా తప్పే

మాదాపూర్​, వెలుగు : మాదాపూర్​లోని కేబుల్ బ్రిడ్జిపై గత ఆదివారం తెల్లవారుజామున   బైక్​తో స్టంట్స్​ చేసిన యువకులను సైబరాబాద్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ర్యాష్​ అండ్​ నెగ్లిజన్స్​ కేసు ఫైల్ చేసి, చలాన్​ విధించారు. అయితే,  స్టంట్స్​ చేసిన వారిలో మలక్​పేట్​కు చెందిన పాలిటెక్నిక్​ స్టూడెంట్​ అక్బర్​ ​  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

దీంతో ట్రాఫిక్​  పోలీసులు అతడితో అవేర్​నెస్ వీడియో చేయించారు.  ‘నేను స్టంట్స్ చేయడంతో పోలీసులు నా బైక్​కు చలానా వేశారు. కౌన్సెలింగ్ ఇచ్చారు.  ఇకపై అలా చేయను.  మీరు కూడా ఇలాంటివి చేయకండి’ అని  అక్బర్​ చెప్పిన వీడియోను  సైబరాబాద్​ ట్రాఫిక్ పోలీసులు సోషల్​ మీడియాలో షేర్ చేశారు.  కేబుల్​ బ్రిడ్జిపై, టీ హబ్​ వద్ద ఇదే విధంగా బైక్​పై స్టంట్స్ చేసిన సికింద్రాబాద్​కు చెందిన రాహుల్​ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.