మోడీజీ మీరు ఓకే అంటే నేను రంగంలోకి దిగుతా

మోడీజీ మీరు ఓకే అంటే నేను రంగంలోకి దిగుతా

భారత్ – చైనాల మధ్య నెలకున్న వివాదాల్ని పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ట్రంప్ మధ్యవర్తిత్వంపై ప్రధాని మోడీ తిరస్కరించే అవకాశం ఉంది. గతంలో భారత్ -పాక్ కాశ్మీర్ వివాదంపై ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు భారత్  తిరస్కరించింది. కశ్మీర్‌పై మూడో దేశం జోక్యం తాము కోరుకోమని భారత్ స్పష్టం చేసింది.

మరోవైపు  భారత్ – చైనా వివాదాలపై జాతీయ భద్రతా సలహదారు అజిత్ తో పాటు త్రిదళాధిపతి బిపిన్ రావత్ , రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్ లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాల వివాదాల్ని దౌత్య  పరంగా చర్చించి పరిష్కరించే పరిస్థితులపై చర్చించారు.