డాన్‌‌‌‌‌‌‌‌స్కే బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఐటీ సెంటర్ కొన్న ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌

డాన్‌‌‌‌‌‌‌‌స్కే బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఐటీ సెంటర్ కొన్న ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియాలోని  డాన్‌‌‌‌‌‌‌‌స్కే బ్యాంక్‌‌‌‌‌‌‌‌  ఐటీ ఆపరేషన్స్‌‌‌‌ను  ఇన్ఫోసిస్ కొనుగోలు చేసింది.  ఈ బ్యాంక్ తన డిజిటల్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను మరింతగా పెంచుకోవడానికి ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌తో స్ట్రాటజిక్ పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ను ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌ 26 న  కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 454 మిలియన్ డాలర్లు. ఐదేళ్ళ కాలానికి గాను ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నామని ఇన్ఫోసిస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో అప్పుడు పేర్కొంది. 

తాజాగా బ్యాంక్‌‌‌‌‌‌‌‌కు చెందిన  ఐటీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంపెనీ దక్కించుకుంది. డెన్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌లో హెడ్‌‌‌‌‌‌‌‌క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న డాన్‌‌‌‌‌‌‌‌స్కే బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఇండివిడ్యువల్స్‌‌‌‌‌‌‌‌, బిజినెస్‌‌‌‌‌‌‌‌లకు బ్యాంకింగ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను అందిస్తోంది.   ఈ బ్యాంక్ ఐటీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,400 మంది ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌ టొపాజ్‌‌‌‌‌‌‌‌, ఏఐ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌లతో బ్యాంక్ డిజిటల్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను ఇన్ఫోసిస్ మెరుగుపరచనుంది. ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌ – డాన్‌‌‌‌‌‌‌‌స్కే బ్యాంక్ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ ఐదేళ్ల కోసం కుదుర్చుకోగా, మరో మూడేళ్ల పాటు కొనసాగించడానికి అవకాశం ఉంది. 

ఈ డీల్‌‌‌‌‌‌‌‌ కుదిరిన టైమ్‌‌‌‌‌‌‌‌లోనే ఇన్ఫోసిస్ ప్రత్యర్ధి కంపెనీ టీసీఎస్‌‌‌‌‌‌‌‌  బ్రిటిష్‌‌‌‌‌‌‌‌ పెన్షన్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ నెస్ట్‌‌‌‌‌‌‌‌తో 10 ఏళ్ల కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకుంది. ఈ డీల్‌‌‌‌‌‌‌‌ విలువ 840 మిలియన్ పౌండ్లు. మరోవైపు ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌ ఇద్దరు టెన్నిస్ స్టార్లతో మల్టీ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకుంది. వుమెన్స్ టెన్నిస్ వరల్డ్‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 ఇగా స్వైటెక్‌‌‌‌‌‌‌‌ను గ్లోబల్‌‌‌‌‌‌‌‌ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమించింది. రఫెల్‌‌‌‌‌‌‌‌ నాదల్‌‌‌‌‌‌‌‌తో మూడేళ్ల కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకుంది. ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమించింది.