న్యూఢిల్లీ: ఆదాయాన్ని అక్రమంగా పెంచి చూపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరు కంపెనీ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా, ఎల్ఐసీ పెట్టుబడి నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు.
దాని ఆఫీసూ ఎక్కడుందో తెలియదన్నారు. ఎల్ఐసీకి ఈ సంస్థలో 10.80 శాతం వాటా ఉంది. ఈ షేర్లను ఆ కంపెనీ ఓపెన్ మార్కెట్ నుంచి కొన్నదని, ప్రమోటర్లు షేర్లు అమ్మలేదని పేర్కొన్నారు.
ఎల్ఐసీ ఆ షేర్లను అమ్మితే సాధారణ ప్రజలకే లాభం వస్తుందని మెహతా అన్నారు. ఎల్ఐసీ దీనిపై ఇంకా స్పందించలేదు.సెబీ చర్యల కారణంగా ఈ నెల మూడో తేదీ నుంచి రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్ల విలువ 14 శాతానికిపైగా పడిపోయింది. ఇది సోమవారం రూ. 94.50 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకింది.
