హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే డబుల్ ఇళ్లు

హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే డబుల్ ఇళ్లు

హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే డబుల్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. GHMC పరిధిలో నిర్మిస్తున్న డబల్ ఇళ్ల పురోగతిపై ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులతో గురువారం రివ్యూ చేశారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే GHMCలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని త్వరలోనే ఇవన్నీ పూర్తవుతాయన్న సమాచారాన్ని అధికారులు కేటీఆర్ కు తెలియజేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి కావడానికి గడువు సమీపిస్తున్న క్రమంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణ ప్రాంతాల్లో గ్రీనరీకి ప్రధాన్యం ఇవ్వాలని…లబ్ధిదారులను వేగంగా ఎంపిక చేయాలని సూచించారు. పారదర్శకంగా ఎంపిక జరగాలని…గతంలో ఇళ్లు వచ్చిన వారికి తిరిగి ఇళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలని, ఇందుకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు GHMC కమిషనర్ లోకేష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ, ఇతర హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.