భద్రాచలం,వెలుగు: ప్రతిపక్షనాయకుడు కేసీఆర్ రాజీనామా చేయాలని, ప్రజాధనానికి లెక్కలు చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం భద్రాచలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ నాయకులతో కలిసి క్యాంపు ఆఫీసు, అంబేద్కర్ సెంటర్, యూబీరోడ్డు, నెహ్రూమార్కెట్, జీసీసీ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజలకు ముఖం చూపించడం లేదని, వెయ్యి రోజులు ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారన్నారు.
