హైదరాబాద్, వెలుగు: యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ కేసులో డాక్టర్ అట్లూరి నమ్రతను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మంగళ, బుధవారాల్లో రెండ్రోజుల పాటు మహిళా అధికారుల సమక్షంలో ప్రశ్నించాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సరోగసీ, పిల్లల విక్రయాలతో కోట్లాది రూపాయలు మనీ లాండరింగ్ చేసినట్టు గుర్తించిన ఈడీ ఈ నెల 13న నమ్రతను అరెస్ట్ చేసింది. పీఎంఎల్ఏ కింద నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది. చంచల్‌గూడ మహిళా జైలు రిమాండ్‌లో ఉన్న నమ్రతను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించారు.
