బీజేపీకి బీసీలు వెన్నుదన్నుగా ఉన్నారు

బీజేపీకి బీసీలు వెన్నుదన్నుగా ఉన్నారు

బీజేపీకి బీసీలు వెన్నుదన్నుగా ఉండబట్టే అన్ని రాష్ట్రాల్లో అధికారం సాధ్యపడిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీలను బీజేపీకి చేరువ చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. సామాజిక, ఆర్ధిక, విద్య, ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాల కోసం ప్రధాని మోడీ ఎన్నో పథకాలు అమలులోకి తెచ్చారని ఆయన అన్నారు.

‘స్వయంగా ప్రధాన మంత్రే బీసీ వర్గాల నుంచి వచ్చారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీలను చైతన్యపరిచి బీజేపీ వైపు తీసుకురావాలి. బీసీ కమిషన్‌కి చట్టబద్ధత కల్పించి, ఆ వర్గాల అభ్యున్నతికి పాల్పడింది మోడీ సర్కారే. బీసీల్లో కూడా ప్రభుత్వ ఫలాలు కొందరికే అందుతున్నాయి. మిగతా బీసీ వర్గాలకు కూడా ఫలాలు అందేలా జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేశాం. రోస్టర్ సిస్టమ్‌లో మార్పులు తీసుకొచ్చి, అనేక సంక్షేమ పథకాలు బీసీల కోసం అమలు చేస్తున్నాం. కరోనా సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలను బుక్ రూపంలో తీసుకొచ్చాం. బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీలో బీహార్ ఎన్నికలు మరియు తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నికల గురించి కూడా చర్చించాం. రైతు చట్టాల విషయంలో లెఫ్ట్, ప్రాంతీయ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. టీఆర్ఎస్ కూడా అలాగే చేస్తోంది. కిసాన్ అభియాన్‌తో అగ్రి చట్టాల గురించి రైతులకు వివరిస్తాం. కేసీఆర్ దోపిడీ ఎక్కడ ఆగిపోతుందనే ఉద్దేశ్యంతోనే రైతు బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాం’ అని ఆయన అన్నారు.

For More News..

ఏసీబీ పేరుతో ఎమ్మెల్యేకు బెదిరింపులు

నువ్వు నాకు కూతురిగా పుట్టాలి.. నేను నీకు తండ్రిగా పుట్టాలి

ఎంసెట్‌లో మళ్లీ గందరగోళం.. క్వాలిఫై అయినా ర్యాంకు దక్కలేదు