- డీఆర్‌డీఎల్ డైరెక్టర్ జీఏఎస్ మూర్తి
ఓయూ, వెలుగు: డీఆర్‌డీఎల్ వంటి సంస్థల్లో జరిగే పరిశోధనలకు టెక్నాలజీ కాలేజీ స్టూడెంట్ల అవసరం ఎంతో ఉందని డీఆర్‌డీఎల్ డైరెక్టర్ డాక్టర్ జీఏఎస్ మూర్తి అన్నారు. ఆదివారం ఓయూ టెక్నాలజీ కాలేజీలో గ్లోబల్అలుమ్నీ మీట్ జరిగింది. జీఏఎస్మూర్తి చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. పూర్వ విద్యార్థులు తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్న విషయాలను రాబోయే తరాలకు అందించి, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. కాలేజీ ప్రిన్సిపల్ప్రొఫెసర్సాయిలు మాట్లాడుతూ.. గ్లోబల్అలుమ్నీ మీట్‌లో భాగంగా పూర్వ విద్యార్థులు కాలేజీ అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు అందజేశారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన మోడ్రన్ ల్యాబ్‌ను ఐఐసీటీ డైరెక్టర్డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్రవీందర్యాదవ్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓయూ సిటీ అలుమ్నీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ రాజమహేందర్ రెడ్డి, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
సామాజిక సేవతోనే గౌరవం.. గుర్తింపు
- ఈవెనింగ్ క్లినిక్ ఓపెనింగ్‌లో మంత్రి తలసాని
ఖైరతాబాద్, వెలుగు: పేద ప్రజలకు సాయం అందించడం, సామాజిక సేవతోనే సమాజంలో గౌరవం, శాశ్వత గుర్తింపు లభిస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. నమానత్ జైన్ ట్రస్ట్, కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఆరాధన భవన్‌లో ఏర్పాటు చేసిన ఈవెనింగ్ క్లినిక్‌ను మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. పేదలకు ప్రతి ఒక్కరు సాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఏండ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నమానత్జైన్ ట్రస్ట్‌ను అభినందించారు. స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, కార్పొరేటర్ విజయారెడ్డి, ట్రస్ట్ చైర్మన్ ఉత్తమ కుమార్ జైన్, ప్రమోద్ కుమార్ జైన్, కిమ్స్ చైర్మన్ భాస్కర్‌రావు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత
పద్మారావునగర్: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో ఆదివారం 46 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుచుల పెండ్లికి భారీ మొత్తంలో ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
కార్పొరేటర్లు హేమలత, మహేశ్వరి, సికింద్రాబాద్ తహసీల్దార్ శైలజ పాల్గొన్నారు.
బీసీ–ఏలో ఇతర కులాలను చేర్చొద్దు
- తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం
ముషీరాబాద్, వెలుగు: బీసీ–ఏ గ్రూపులో ఇతర కులాలను కలపొద్దని తెలంగాణప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఏఎల్ మల్లయ్య డిమాండ్‌చేశారు. ఆదివారం లోయర్ ట్యాంక్ బండ్‌లోని సంఘం స్టేట్ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో మల్లయ్య పాల్గొని మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి బీసీ–ఏ జాబితాలో చేరామని, ఇందులో ఇతర కులాలను చేర్చి తమకు అన్యాయం చేయొద్దన్నారు. తమకు ఇప్పటికే విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్‌లకు మేలు చేయండి, సంక్షేమ పథకాలు ఇవ్వండి కానీ గంగపుత్రుల పొట్ట కొట్టొద్దన్నారు.
అంబేద్కర్‌ను తిట్టిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు పెట్టాలి
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్
ఖైరతాబాద్, వెలుగు: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కామన్అయిందని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బంజారాహిల్స్ మాల మహానాడు ఆఫీసులో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్ తో కలిసి చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్‌పై రాయలసీమ యూనివర్సిటీలో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న ఇస్మాయిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బాధ్యత కలిగిన హోదాలో ఉండి ఇలా మాట్లాడడం దారుణం అన్నారు. ఇస్మాయిల్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే విధుల్లోంచి తొలంగించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మాల మహానాడు ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చలో కర్నూలుకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్నె శ్రీధర్ రావు, అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పుణ్య భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

