బీటెక్/ బీఈ చేశారా ? డీఆర్డీఓలో JRF పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..

బీటెక్/ బీఈ చేశారా ? డీఆర్డీఓలో JRF పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..

డీఆర్ డీఓ సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డీఓ సీఏబీఎస్)  జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఖాళీలు: 10 (జూనియర్ రీసెర్చ్ ఫెలో).

విభాగాల వారీగా ఖాళీలు: ఏరోనాటికల్ ఇంజినీరింగ్ 01, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ 04, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) 03,  ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 01,  మెకానికల్ ఇంజినీరింగ్ 01.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బి.టెక్.తోపాటు 2024 లేదా 2025 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే  గేట్ స్కోర్ కలిగి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 22.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు      www.drdo.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి.