సింగరేణి కార్మికులకు తాగునీరు అందించాలి 

సింగరేణి కార్మికులకు తాగునీరు అందించాలి 
  • బీజేపీ  జిల్లా ప్రెసిడెంట్​ రఘునాథ్​ 

నస్పూర్, వెలుగు: నస్పూర్​ మున్సిపాలిటీ పరిధిలోని  సీతారాంపల్లి సింగరేణి ఫిల్టర్ బెడ్ పని చేయక ఆరు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘనాథ్​ ఆరోపించారు. బుధవారం  పట్టణ అధ్యక్షుడు అగల్ డ్యూటీ రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోనుగోటి రంగరావు తో కలిసి పరీశిలించారు. ఈ సందర్భంగా  బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ రఘునాథ్​మాట్లాడుతూ..  ఫిల్టర్ బెడ్ పని చేయకపోవడంతో గోదావరి నుంచి నీటిని నేరుగా శుద్ధి చేయకుండా ప్రజలకు, సింగరేణి కార్మిక  కుటుంబాలకు అందిస్తున్నారన్నారు.

దీని వల్ల వారు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. వెంటనే ఫిల్టర్ బెడ్ మరమ్మతులు చేసి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో బీజేపీ లీడర్లు ఈర్ల సదానందం, మిట్టపల్లి మొగిలి, అడిచెర్ల రూప దేవి, తిప్పని భీమయ్య, రావుల లక్ష్మణ్, కొంతం మహేందర్, తరాల విజయ్, నరగొని సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.