War Breaking: ఇరాన్‎పై యుద్ధంలో కీలక మలుపు: కదన రంగంలోకి దిగుతున్న UAE

War Breaking: ఇరాన్‎పై యుద్ధంలో కీలక మలుపు: కదన రంగంలోకి దిగుతున్న UAE

ఇరాన్ పై యుద్ధం త్వరలో ముగుస్తుంది.. రెండు వారాల్లో క్లోజ్ చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE సంచలన ప్రకటన చేసింది. మేం కూడా యుద్ధంలోకి వస్తున్నాం అని చెప్పేసింది. అమెరికాతో కలిసి ఇరాన్‎పై యుద్ధం చేయబోతున్నట్లు స్పష్టం చేస్తోంది. ఇరాన్‎పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిన తర్వాత.. UAEలోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తుంది ఇరాన్. ఇప్పటి వరకు UAEకి అండగా అమెరికా ఉంటూ వస్తుంది. ఇప్పుడు UAEనే డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగటం చూస్తుంటే.. ఈ యుద్ధం ఇప్పటికే ఆగేట్టు లేదనేది తెలుస్తోంది.

గత నెల రోజులుగా రణరంగాన్ని తలపిస్తోన్న పశ్చిమాసియా యుద్ధం మరో మలుపు తిరగనుంది. ఇప్పటి వరకు అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు ప్రతీదాడులు చేసుకోగా తాజాగా యుద్ధ భూమిలోకి మరో దేశం అడుగు పెట్టేందుకు రెడీ అయ్యింది. ఇరాన్‎కు వ్యతిరేకంగా యుద్ధానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సిద్ధమైంది. మధ్యప్రాచ్యంలో ఘర్షణలు పతాక స్థాయికి చేరిన వేళ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ చెర నుంచి విడిపించేందుకు అమెరికా దాని మిత్రదేశాలకు సహయపడేందుకు యూఏఈ ముందుకు వచ్చింది. 

►ALSO READ | పెళ్లి చేసుకోండి ట్యాక్స్ సేవ్ చేసుకోండి : బ్రహ్మచారులపై ప్రత్యేక పన్ను వేస్తున్న దేశం : భూ మండలంపై ఇదే ఫస్ట్

ఈ మేరకు అరబ్ అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇరాన్‎పై దాడుల కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం కోసం యూఏఈ లాబీయింగ్ చేస్తోందని పేర్కొంది. హోర్ముజ్ జలసంధిని బలవంతంగా తిరిగి తెరవడానికి ఒక కూటమిని ఏర్పాటు చేయాలని యూఏఈ దౌత్యవేత్తలు అమెరికా, యూరప్, ఆసియాలోని సైనిక శక్తులను కూడా కోరారని సమాచారం. 

కాగా, ఇరాన్‎పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిన తర్వాత.. UAEలోని అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. అంతేకాకుండా యూఏఈ ఎయిర్ పోర్టు, ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ విరుచుపడింది. దీంతో ఇరాన్‎పై యూఏఈ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‎కు వ్యతిరేకంగా యుద్ధంలో దిగేందుకు యూఏఈ కదనరంగంలోకి దిగేందుకు సై అంటోంది. ఇదే జరిగితే ఇరాన్‎కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొనే మొదటి పర్షియన్ గల్ఫ్ దేశంగా యూఏఈ నిలవనుంది.