Summer excercise:  ఎండాకాలం వర్కవుట్లు.. వ్యాయామాలు.. ఇవి పాటించకపోతే ఇబ్బందే..! 

Summer excercise:  ఎండాకాలం వర్కవుట్లు.. వ్యాయామాలు.. ఇవి పాటించకపోతే ఇబ్బందే..! 

ఎండాకాలం వర్కవుట్​ లు  చేసేటప్పుడు...  ఏంచేస్తే మంచిది? ఎట్ల చేస్తే మంచిదో తెలుసుకోవాలి. 'ఏం కాదు లే... ఎప్పుడు చేస్తున్నవే కదా' అని జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టమొచ్చినట్లు ఎక్సర్ సైజ్ చేస్తే ఆరోగ్యం రిస్క్ లో పడ్తది. అయితే ఎండల్లో ఎలా ఎక్సర్​ సైజ్​ లు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. !

నీళ్లు తాగకుండా ఉండొద్దు

'దూపయితనే నీళ్లు తాగుతా' అనే ఫార్ములాను ఈ కాలంలో మర్చిపోవాలె, వర్కవుట్ చేసేటప్పుడు ఉష్ణోగ్రతని నియంత్రించడానికి శరీరం నీటిని వాడుకుంటది. శరీరంలో లిక్విడ్ లెవల్స్ తక్కువగా ఉంటే కొవ్వుని వాడుకుంటది. ఆ టైంలో వర్కవుట్స్ చెయ్యాలనిపించదు. అయితే అన్ని లిక్విడ్స్ ఒక్కటే కాదని గుర్తుంచుకోవాలె.

మార్నింగ్ లేస్తూనే ఓ గ్లాస్ నీళ్లు తాగితే మంచిది. కానీ వర్కవుట్​ కు  ముందు కిఫీన్ స్థాయి ఎక్కువగా ఉండే కాఫీ తీసుకుంటే బాడీ ఇంకా తొందరగా డీహైడ్రేట్ అయితరు. కాబట్టి వర్కవుట్ చేసేటప్పుడు ఎప్పుడూ వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవాలె. మధ్య మధ్యలో సిప్ చేస్తూ ఎక్సర్సైజ్ లు చేస్తుండాలె.

ఎండలో ఎక్సర్​సైజ్​ లు వద్దు.

ఎనిమిది గొట్టకముందే సూరీడు సురుక్కుమంటుండు. కాబట్టి ఎండల ఎక్సర్​ సైజ్​ లు  పెట్టుకోవద్దు. లేత కిరణాలు పడటం ఆగిపోయే లోపే అవుట్ డోర్ వర్కవుట్లు ముగించాలి. లేదంటే సాయంత్రం వాతావరణం చల్లగయ్యాక చేసినా మంచిదే. ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మ సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయ్.

ముఖ్యంగా భయంకరమైన మాలిగ్నెంట్ మెలనోమా క్యాన్సర్ రావొచ్చు.. ఉదయం ఎనిమిది నుంచి నాలుగు గంటల మధ్య ఎలాంటి అవుట్ డోర్ ఎక్సర్ సైజ్​ లు చెయ్యకూడదు. కాబట్టి టైం చెక్ చేసుకుంట ఎక్సర్సైజ్ చెయ్యాలె.

ఎత్తు ప్రదేశాల్లో జాగింగ్ వద్దు

కొంతమందికి కొండలపొంటి పరుగెత్తడం అంటే ఇష్టం. అయితే ఎండాకాలంలో ఎత్తైన ప్రదేశాలకు జాగింగ్ వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే అంత ఎత్తులో ఆక్సిజన్ స్థాయిలు తక్కువుంటయ్. ఎత్తైన కొండల్లో జాగింగ్​ కు వెళ్లడం కంటే సమాంతర నేలపై లేదా ట్రెడ్ మిల్ పై జాగింగ్ చెయ్యాలె..

కాలానికి తగ్గ దుస్తులేసుకోవాలె

అవుట్ డోర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్కిన్​ టైట్,పాలిస్టర్ దుస్తులు వేసుకోవద్దు. వేడిని తట్టుకునేలా లూజ్ ఫిట్టింగ్, లేత రంగు దుస్తులు వేసుకోవాలె. కొద్ది సేపే వర్కవుట్ చేసే వాళ్లకయితే కాటన్ బెటరే. కానీ ఎక్కువసేపు వర్కవుట్ చేసేవాళ్లకు ఎండాకాలంలో అధిక చెమట పడుతది. వీళ్లు బ్రీతబుల్ సింథటిక్ స్పోర్ట్స్ దుస్తులను ఎంచుకోవాలి. అవి చెమటని. పూర్తిగా పీల్చుకుని బయటకు పంపిస్తది. దీంతోపాటు కూల్ ఫీలింగ్ ఇస్తయ్.

–వెలుగు, లైఫ్​ –