గణేశ్ విగ్రహం తరలిస్తుండగా.. 11 కేవీ వైర్లు తగిలి డ్రైవర్  మృతి

గణేశ్ విగ్రహం తరలిస్తుండగా.. 11 కేవీ వైర్లు తగిలి డ్రైవర్  మృతి

ఘట్కేసర్, వెలుగు: గణేశ్  విగ్రహం తరలిస్తుండగా విద్యుత్  షాక్​ తగిలి మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్​ సమీపంలో వెహికల్​ డ్రైవర్  చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భానుప్రసాద్(28) అశోక్​ లేలాండ్  వాహనం  నడుపుతూ బతుకుతున్నాడు. సోమవారం రాత్రి ఘన్‌‌పూర్  నుంచి అల్వాల్‌‌కు విగ్రహాన్ని తరలించేందుకు బయలుదేరాడు. మార్గమధ్యలో రోడ్డుపై 11 కేవీ విద్యుత్  తీగలు వేలాడుతుండగా, భాను ప్రసాద్  ఈ విషయాన్ని గణేశ్  ఉత్సవ నిర్వాహకుడు శరత్  యాదవ్కు తెలియజేశాడు.

అయినప్పటికీ ముందుకు వెళ్లాలని చెప్పడంతో వెహికల్​ ముందుకు తీసుకెళ్లగా, గణేశ్  విగ్రహం హైటెన్షన్  వైర్లకు తగిలింది. ప్రాణభయంతో కిందికి దిగే ప్రయత్నంలో భాను ప్రసాద్  విద్యుత్​ షాక్​కు గురయ్యాడు. తీవ్రగాయాలపాలైన అతడిని సికింద్రాబాద్‌‌ యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున చనిపోయాడు. మృతుడి తమ్ముడు తరుణ్  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.