ముంబై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

ముంబై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. జూలై 3న ఉదయం ముంబై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా కెన్యా  నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 1.3 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. లగేజ్ బ్యాగ్ కింద దాచి తీసుకొచ్చాడు. దీని విలువ మార్కెట్లో  దాదాపు రూ.12.98 కోట్లు ఉంటుందని అధికారులు  తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. 

జూన్ 26న  మాదకద్రవ్యాల దుర్వినియోగం,  అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా  హైదరాబాద్ కస్టమ్స్ 'సే నో టు డ్రగ్స్' ప్రచారం కింద 8,946.263 కిలోల  పలు  నార్కోటిక్ డ్రగ్స్ , సైకోట్రోపిక్ పదార్థాలను ధ్వంసం చేసింది. ఇందులో  2655.942 కిలోల గంజాయి,11 కిలోల హెరాయిన్, 409.39 కిలోల అల్ప్రాజోలం సంబంధిత పదార్థాలు, 142.932 కిలోల ఎఫెడ్రిన్ హైడ్రోక్లోరైడ్ దాని సంబంధిత పదార్థాలు, కెజి హైడ్రోక్లోరైడ్ , 53.983 కేజీల మెథాక్వలోన్ , 5595.14 కేజీల రసాయనాలు  ఉన్నాయి.