మందుబాబు హల్ చల్: క్వార్టర్ మందు ఇవ్వకపోతే చచ్చిపోతా

మందుబాబు హల్ చల్: క్వార్టర్ మందు ఇవ్వకపోతే చచ్చిపోతా

హైదరాబాద్: ప్రేమ కోసం టవర్ ఎక్కినవారిని చూశాం.. పలు డిమాండ్ల కోసం సూసైడ్ చేసుకుంటానని బెదిరించిన వారిని చూశాం. కానీ క్వార్టర్ మందు కోసం ఓ తాగుబోతు కరెంట్ స్తంభం ఎక్కి హల్ చల్ చేశాడు. ఈ సంఘటన ఆదివారం హైదరాబాద్ లో జరిగింది.  సికింద్రాబాద్ లోని గాంధీ హస్పిటల్ సమీపంలో ఓ మందుబాబుకి మద్యం తాగాలని పించిందట. అయితే చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో వెరైటీగా ఆలోచించాడు.  30 అడుగుల ఎత్తు ఉన్న కరెంట్ స్తంభం ఎక్కి క్వార్టర్ బాటిల్ ఇస్తేనే దిగుతా.. లేదంటే చచ్చిపోతానని బెదిరించాడు. మందుబాబు డిమాండ్ చేసి అందరూ నవ్వుకున్నారు. ఫస్ట్ జోక్ చేస్తున్నాడను కున్నారు.

కానీ కరెంట్ వైర్లు ముట్టుకుంటానని తెలుపడంతో స్థానికులు పోలీసులకు  సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిందపడితే చనిపోకుండా ఉండేందుకు పరదాలు ఏర్పాటు చేశారు. ఎంత బతిమిలాడినా దిగకపోవడంతో చివరకు వైన్ షాపులో క్వార్టర్ బాటిల్, వాటర్ తీసుకురాగా అప్పుడు కిందకు దిగాడు. ఆ వ్యక్తి తాగుడుకు బానిస కావడంతోనే ఇలా చేసి ఉంటాడని తెలిపారు పోలీసులు.

see also: కులం పేరుతో దూషించారని ఆత్మహత్య

see also: కనికరంలేని తల్లి: కొడుకుని చంపింది