భయం లేదా రా మీకు : కదులుతున్న కారుపై పుష్​అప్స్

భయం లేదా రా మీకు : కదులుతున్న కారుపై పుష్​అప్స్

గురుగ్రామ్: వయసులో ఉన్న కుర్రాళ్లు, చేతిలో కారుంది, రోడ్లు ఖాళీగున్నయ్.. ఇంకేముందు కారు తీసి అలా షికారుకు వెళ్లారు. బండ్లోనే మందేస్తూ చిందేశారు. అంతటితో కిక్కు రాలేదో ఏమో.. అందులోని ఓ యువకుడు కారు టాప్​ మీదికెక్కి పుషప్స్ తీయడం మొదలు పెట్టాడు. మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ కారు డోర్లమీద కూచుని కేకలు వేస్తూ ఎంకరేజ్ చేశారు. అలా డేంజరెస్ పొజిషన్​లోనే బీరు తాగుతూ హల్ చల్ చేశారు.

మంగళవారం రాత్రి హర్యానాలోని గురుగ్రామ్​ సిటీలో జరిగిన సీన్ ఇది. వెనకాలే కారులో వస్తున్న ఓ వ్యక్తి.. వీళ్ల హంగామాను వీడియో తీసి ట్విట్టర్​లో షేర్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయి ట్రాఫిక్ పోలీసులదాకా పోయింది. బండి నంబర్​తో అడ్రస్ ట్రేస్ చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. ఓనర్​కు రూ.6,500 పెనాల్టీ వేశారు. యువకులపై కేసు పెట్టి, పుషప్స్ తీసిన వ్యక్తిని అరెస్టు చేశారు. రోడ్లమీద ఇలాంటి పిచ్చి చేష్టలను సహించబోమని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.