V6 News

తమిళనాడులో బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడు, 18మంది మృతి

తమిళనాడులో బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడు, 18మంది మృతి

తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  విరుదునగర్ జిల్లాలోని కట్టనార్ లో  ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మందికి తీవ్రగాయాలయ్యారు. వనజ ఫైర్‌క్రాకర్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 30 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ పేలుడు ధాటికి కర్మాగారంలోని అనేక గదులు పూర్తిగాప్రమాద సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులు భయంతో పరుగులు పెట్టారు.  

పేలుడు ధాటికి బాణసంచా తయారీ నిర్వహిస్తున్న భవనం మొత్తం కుప్పకూలిపోయింది. భారీఎత్తునమంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి  చేరుకున్న ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం విరుదునగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు  చేపట్టారు. 

ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పేలుడులో మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. విరుదునగర్ జిల్లా, కట్టనార్‌పట్టిలోని బాణసంచా ఫ్యాక్టరీ పేలుడులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్న విషాద వార్త చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం అని Xలో పోస్ట్ చేశారు స్టాలిన్