V6 News

Prakash Raj: రామాయణ వ్యాఖ్యలపై దుమారం.. ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ రియాక్షన్.. వీడియో వైరల్

Prakash Raj: రామాయణ వ్యాఖ్యలపై దుమారం.. ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ రియాక్షన్.. వీడియో వైరల్

సినీ వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చేసే పోస్టులు, మాట్లాడే మాటలు.. తరచుగా సోషల్ మీడియా వైరల్ అవుతుంటాయి. లేటెస్ట్గా కేరళ సాహిత్యోత్సవం ఫెస్టివల్లో భాగంగా ఆయన రామాయణపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఆ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడిన తీరుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియోలో ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.. ‘‘ఇటీవల నేను ఒక సాహిత్య కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో కొన్ని మాటలను మాత్రమే తీసుకుని వక్రీకరించారు. నేను అవతారపురుషుడు రామ గురించి తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలను దెబ్బతీశానని అంటున్నారు.

కానీ అన్ని మతాలను, అందరినీ గౌరవించే నాకు అలా మాట్లాడే అవరం మాత్రం లేదు. కానీ, ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయాల్ని చేస్తున్న వాళ్లని , నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక, నన్ను హిందూ వ్యతిరేకిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పాపం వాళ్ళ ఏడ్పు, కష్టం నాకు అర్ధమవుతుంది. అందువల్ల, నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి. తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి.. తోటపనుల్లో బిజీగా ఉన్నా.. త్వరలోనే వస్తాను. అప్పటిదాకా మీ పని మీరు చూసుకుంటారా.. లేక ఇలానే వాగుతూ ఊగుతుంటారా మీ ఇష్టం’’ అని ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. 

రామ, లక్ష్మణ ఉత్తరాది నుంచి దక్షిణానికి వచ్చినవారిగా పేర్కొన్నారు. అడవిలో పండ్లు తింటుండగా రావణుడు, శూర్పణఖ అక్కడికి వచ్చి వారిని గమనించేలా కథను వివరించారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ప్రకాశ్ రాజ్ ఏం మాట్లాడంటే?

రామ, లక్ష్మణ ఉత్తరాది నుంచి దక్షిణానికి వచ్చినవారిగా ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. అడవిలో పండ్లు తింటుండగా రావణుడు, శూర్పణఖ అక్కడికి వచ్చి వారిని గమనించేలా కథను వివరించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

‘‘రామ, లక్ష్మణ దక్షిణాదికి వచ్చి ఒక అడవిని చూస్తారు. అక్కడ ఉన్న పండ్లు తినవచ్చని లక్ష్మణుడు చెప్పడంతో ఇద్దరూ పండ్లు తింటారు. ఈ సమయంలో రావణుడు, శూర్పణఖ అక్కడికి  అక్కడికి వచ్చి వారిని గమనిస్తారు. వారు ఆకలితో ఉన్నారని భావించి ముందుగా తిననివ్వాలని రావణుడు చెబుతాడు.

తర్వాత రాముడు వారు ఎవరో తెలుసుకుని, తిన్న పండ్లకు డబ్బు చెల్లిస్తామని అంటాడు. దానికి శూర్పణఖ ధర చెప్పగా, తమ వద్ద అంత డబ్బు లేదని రాముడు చెబుతాడు. అప్పుడు రావణుడు, మీరు తిన్న పండ్ల విత్తనాలను నాటి చెట్లు పెంచి వెళ్లాలని సూచిస్తాడు.

చివరగా వారి పేర్లు అడగగా, రాముడు తనను ఉత్తరాది నుంచి వచ్చినవాడిగా పరిచయం చేసుకుంటాడు.ఆ తర్వాత నా పేరు రావణుడు దక్షిణాది నుంచి వచ్చాను అంటాడు’’ ఇలా రామాయణాన్ని కొత్తగా, వ్యంగ్యంగా ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడారు.