ఇంటర్నేషనల్ లీగ్ 20లో దుబాయ్ క్యాపిటల్స్ బోణి

ఇంటర్నేషనల్ లీగ్ 20లో  దుబాయ్ క్యాపిటల్స్ బోణి

అట్టహాసంగా ప్రారంభమైన ఇంటర్నేషనల్  లీగ్ టీ20 లో దుబాయ్ క్యాపిటల్స్ 73 పరుగులతో  అబుదాబీ నైట్ రైడర్స్ టీమ్పై విజయం సాధించింది. 189 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన అబుదాబీ నైట్ రైడర్స్..20 ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులే చేసి ఓడిపోయింది. 

మొదట బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్..20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్ రాబిన్ ఉతప్ప 33 బంతుల్లో 43 పరుగులు చేయగా..కెప్టెన్ పావెల్ 29 బంతుల్లో 48 రన్స్ కొట్టాడు.  జో రూట్ 26 పరుగులు, సికిందర్ రజా 26 పరుగులతో రాణించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో అలీ ఖాన్, రవి రాంపాల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. సునీల్ నరైన్, అడ్య్రూ రసెల్ తలో వికెట్ పడగొట్టారు. 

ఆ తర్వాత 188 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన అబుదాబీ నైట్ రైడర్స్..20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 114 పరుగులే చేసి ఓడిపోయింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 38 బంతుల్లో 54 పరుగులతో రాణించగా..అండ్య్రూ రసెల్ 12 పరుగులు చేశాడు. కొలిన్ ఇంగ్రామ్, బ్రాండన్ కింగ్, జవార్ ఫరీద్, సునీల్ నరైన్ వంటి బ్యాట్స్ మన్ దారుణంగా విఫలమయ్యారు. దుబాయ్ కాపిటల్స్ బౌలర్లలో  రజా అకీపుల్లా ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, పావెల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇసురు ఉడాన, హజ్రత్ లుక్మాన్, సికందర్ రజా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.