కేసీఆర్ అవినీతిని ప్రజల్లోకి తీస్కెళ్తాం: ఉత్తమ్

కేసీఆర్ అవినీతిని ప్రజల్లోకి తీస్కెళ్తాం: ఉత్తమ్

కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని ఆరోపిస్తూ.. అందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ …ప్రాజెక్టుల దగ్గర ఇవాళ(మంగళవారం) జలదీక్షకు పిలుపు నిచ్చింది. నల్గొండ జిల్లా గొడుకొండ్ల దగ్గర జలదీక్షకు వెళ్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాల్ దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మాట్లాడిన ఉత్తమ్…తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులకు అవమానం జరుగుతోందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారన్నారు. సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరినా…సీఎం కేసీఆర్ కు  కనీసం కనికరం లేకుండా పోయిందన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు  దగ్గర వేలమంది ఉండొచ్చు కానీ ముగ్గురం సీనియర్ నాయకులం ఒక్కదగ్గర ఉంటే కేసీఆర్ కు ఎందుకు భయమని ప్రశ్నించారు. SLBC ప్రాజెక్ట్ పేరు చెప్పగానే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు.  ఆయన నిర్లక్ష్యం ,అసమర్థత కారణంగానే  రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తికావడంలేదన్న ఉత్తమ్… కేసీఆర్ అవినీతిని ప్రజల్లోకి తీస్కెళ్తామన్నారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసమే పూర్తి చేశారన్నారు.