దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా రవి నేలకుదిటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీశ్రీ’. తాజాగా ఫారిన్ షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తిచేసినట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ షెడ్యూల్‌లో సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ ఎపిసోడ్స్ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలవనున్నాయని చెప్పారు. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్, తొలి పాట 'బొమ్మ బొమ్మ'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు, దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.
