తరుణ్ భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ భన్సాల్ కలిసి నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్‌గా నటించగా, జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. మే 1న సినిమా విడుదల కానుంది. శనివారం ఈ మూవీ ట్రైలర్‌ను హీరో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశాడు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో దుల్కర్ మాట్లాడుతూ ‘ఈ టైటిల్ విన్నప్పటి నుంచే నాకు చాలా క్యూరియాసిటీ కలిగింది. ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నప్పుడు పవన్ ఈ సినిమా గురించి ప్రతిదీ చెప్తుండేవారు. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ప్రతి విజువల్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది. ఈ సబ్జెక్ట్ అందరికీ రిలేటబుల్‌గా ఉంటుంది.
మనలో చాలామంది ఎప్పుడో ఒకసారి అమెరికా వెళ్లాలని కల కంటారు. కాబట్టి ఆడియెన్స్ కచ్చితంగా కనెక్ట్ అవుతారు. గ్రేట్ కంటెంట్‌తో వస్తోన్న ఈ చిత్రం అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని చెప్పాడు. ఇందులోని ఎంటర్‌టైన్‌మెంట్ వర్కవుట్ అయితే ఈ చిత్రం మరో ‘జాతి రత్నాలు’ అవుతుందని నిర్మాత దిల్ రాజు అన్నారు.
ఈ సినిమా సక్సెస్‌పై టీమ్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని జేడీ చక్రవర్తి చెప్పాడు. ఈ మూవీ ఫస్ట్ 15 నిమిషాలు ఎవ్వరూ మిస్ అవ్వకూడదని ఫరియా అబ్దుల్లా చెప్పింది. ఇదొక ఫన్ రైడ్ అని అందరూ ఎంజాయ్ చేస్తారని మానస చౌదరి చెప్పింది. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు దర్శక నిర్మాతలు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.

