Dussehra 2023: దసరా శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి... వాట్సప్ స్టేటస్‌గా బెస్ట్ కొటేషన్స్

Dussehra 2023:  దసరా శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి... వాట్సప్ స్టేటస్‌గా బెస్ట్  కొటేషన్స్

చరిత్ర ప్రకారం విజయదశమి (Happy Dussehra) రోజున రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.  దసరా పండుగ సందర్భంగా బంధుమిత్రులకు ఎలా శుభాకాంక్షలు తెలపాలి..ఎలాంటి  కోట్స్ ద్వారా  దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పాలో తెలుసుకుందాం. . . 

చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి (Dussehra 2023) అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించు కునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది.

 

                                              దసరా శుభాకాంక్షలు- వాట్సప్ స్టేటస్ 

  • దసరా సందర్భంగా రాముడు మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయాన్ని నింపాలని ప్రార్థిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు! -
  • ఈ దసరా నుంచి మీ అన్ని సమస్యలు తొలగిపోతాయి… దసరా శుభాకాంక్షలు! - 
  • మీలోని రాక్షసుడు ఎల్లప్పుడూ ఓడిపోతాడు, దైవం మీ ఆలోచనలను ఎప్పటికీ నియంత్రిస్తుంది. దసరా శుభాకాంక్షలు! - 
  • చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఆస్వాదించండి. గొప్ప విశేషం ఉన్న, ఆహ్లాదకరమైన, ఆనందకరమైన రోజును ఆస్వాదించండి. దసరా శుభాకాంక్షలు! 
  • దసరా శుభాకాంక్షలు కొటేషన్స్ - దుర్గాదేవి మీ కోరికలన్నీ తీర్చి, మీకు మంచి ఆరోగ్యం, విజయం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ.. విజయదశమి శుభాకాంక్షలు! - 
  • మీ కష్టాలన్నీ ఈ దసరాతో తీరిపోవాలని ఆశిస్తూ.. విజయ దశమి శుభాకాంక్షలు!
  • దసరా సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మతో పాటు మీలో ఉన్న అహం, ద్వేషం, కోపాలను కాల్చండి! - 
  • రాముడు మీ విజయానికి మార్గాన్ని చూపే వెలుగును ఇస్తూనే ఉంటాడు. మీరు జీవితంలోని ప్రతి దశలోనూ విజయం సాధిస్తారు. జై శ్రీ రామ్. దసరా శుభాకాంక్షలు. - ఈ దసరా మీ జీవితంలోని చీకటిని, బాధను దహించి మీకు ఆనందం, శ్రేయస్సును తెస్తుందని ఆశిస్తూ.. విజయదశమి శుభాకాంక్షలు! -
  • చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దసరా వేడుకలు జరుపుకుందాం రండి..! 
  • ఈ పవిత్రమైన రోజు మీకు ప్రేమ, అదృష్టం, ఆనందాన్ని తెస్తుంది. హ్యాపీ దసరా. - అంతిమంగా చెడు ఎప్పుడూ అంతమై మంచి అనేదే గెలుస్తుందని గుర్తుచేసే రోజు ఇది. ఈ పరమార్థాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుందాం. దసరా శుభాకాంక్షలు! - దసరా సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మతో పాటు మీలో ఉన్న అహం, ద్వేషం, కోపాన్ని కాల్చండి! - 
  • రాముడు భూమిపై చెడును నాశనం చేసినట్లే, మీరు కూడా మీ మనసు నుంచి అన్ని ప్రతికూల ఆలోచనలను విజయవంతంగా దూరం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ దసరా! - 
  • ఈ దసరా సందర్భంగా ధర్మ మార్గాన్ని అనుసరించడానికి శ్రీరాముడు మీకు శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ.. హ్యాపీ విజయదశమి..