హైదరాబాద్ లో ఇవాళ, రేపు ( జనవరి 12, 13 ) ఈ-వేస్ట్ శానిటేషన్ డ్రైవ్

హైదరాబాద్ లో ఇవాళ, రేపు ( జనవరి 12, 13 ) ఈ-వేస్ట్ శానిటేషన్ డ్రైవ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: పర్యావరణ పరిరక్షణతో పాటు క్లీన్ సిటీ లక్ష్యంగా జీహెచ్ఎంసీ మెగా ఈ--వేస్ట్ శానిటేషన్ డ్రైవ్​ను సోమ, మంగళవారాల్లో నగరవ్యాప్తంగా 300 వార్డుల్లో నిర్వహించనున్నది. ఈ డ్రైవ్ ద్వారా ప్రజలకు ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వాహణపై అవగాహన కల్పించడంతో పాటు, నివాస, వాణిజ్య, ప్రజా ప్రాంతాల నుంచి ఈ–-వేస్ట్ ను సేకరించి శాస్త్రీయంగా ప్రాసెస్ చేయనున్నారు. ఫ్రిజ్‌‌‌‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, టీవీలు, బ్యాటరీలు, యూపీఎస్‌‌‌‌లు, పవర్ బ్యాంకులు వంటి వివిధ రకాల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఈ డ్రైవ్‌‌‌‌లో సేకరించనున్నారు. 

ఈ కార్యక్రమాన్ని హైమ్స్‌‌‌‌వ్ లిమిటెడ్ సహకారంతో అమలు చేయనుండగా, ప్రతి సర్కిల్‌‌‌‌కు ప్రత్యేకంగా బ్రాండెడ్ ఈ-వేస్ట్ సేకరణ వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. సేకరించిన ఈ-వేస్ట్‌‌‌‌ను దుండిగల్‌‌‌‌లోని  ఈ-వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌‌‌‌కు తరలిస్తారు. ఇప్పటికే ప్రతి వార్డులో తాత్కాలిక ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాలను గుర్తించారు.