వినికిడి లోపాన్ని  తొలిదశలో గుర్తించాలి : ప్రొఫెసర్‌‌ ఎం.సందీప్‌‌  

వినికిడి లోపాన్ని  తొలిదశలో గుర్తించాలి : ప్రొఫెసర్‌‌ ఎం.సందీప్‌‌  

పద్మారావునగర్‌‌, వెలుగు: బాలల్లో వినికిడి లోపాన్ని తొలిదశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే సులువుగా నయం అవుతుందని ఏఐఐఎస్‌‌హెచ్‌‌(మైసూరు) ప్రొఫెసర్‌‌ ఎం.సందీప్‌‌  అన్నారు. శుక్రవారం మీనాక్షి వెంకట్రామన్‌‌ ఫౌండేషన్‌‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌‌ గాంధీ దవాఖానలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 1.4 మందికి సెన్సరీ న్యూరల్‌‌ వినికిడి లోపం ఉంటోందన్నారు.

ఈ సందర్భంగా వినికిడి లోపం ఉన్న చిన్నారులకు ఫౌండేషన్‌‌ తరఫున నాలుగు జతల డిజిటల్‌‌ హియరింగ్‌‌ ఎయిడ్స్‌‌ అందజేశారు. కార్యక్రమంలో గాంధీ సూపరింటెండెంట్​ డాక్టర్​ వాణి, ప్రొఫెసర్‌‌ సి.పి.ఇందిర, డాక్టర్‌‌ చాంద్ని జైన్‌‌, మెడ్‌‌-ఎల్‌‌ సంస్థ ప్రతినిధులు షబ్నం ఫాతిమా, హర్షిత పాల్గొన్నారు.