ఒకే నెలలో ఢిల్లీలో నాలుగోసారి భూకంపం

ఒకే నెలలో ఢిల్లీలో నాలుగోసారి భూకంపం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒకే నెలలో నాలుగో మారు భూకంపం సంభవించింది. శుక్రవారం 2.2 మ్యాగ్నిట్యూడ్ తో తక్కువ తీవ్రతతో భూకంపం వచ్చింది. ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు హస్తినలో నాలుగు సార్లు భూకంపం రావడం గమనార్హం. ఢిల్లీలో భూకంప కేంద్రం పితంపురాలో ఉంది. ఇవ్వాళ ఉదయం 11:28 గంటలకు ఎనిమిది కిలో మీటర్ల డెప్త్ తో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. రీసెంట్ గా 10వ తేదీన మీడియం ఇంటెన్సిటీతో 3.4 మ్యాగ్నిట్యూడ్ తో వజీర్ పూర్ లో భూకంపం సంభవించింది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌ మెంట్ అథారిటీ ప్రకారం.. ఢిల్లీ–హర్ద్ వార్ రిడ్జ్ అని పిలిచే ఓ ప్రధాన భౌగోళిక నిర్మాణంతో ఢిల్లీలో భూకంపానికి సంబంధం ఉందని తెలుస్తోంది.